Header Banner

దర్శనాల్లో మార్పులు.. కొత్త వేళలు..అవన్నీ రద్దు! టీటీడీ తాజా నిర్ణయాలు..!

  Mon Apr 28, 2025 09:22        Devotional

టీటీడీ మరి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. వేసవి సెలవుల వేళ తిరుమలలో రద్దీ బాగా పెరిగింది. సర్వ దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. వేసవి సెలవులు ముగిసే వరకూ ఇదే తరహాలో రద్దీ కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనాల పైన టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సిఫారసు లేఖలను రద్దు చేయటంతో పాటుగా బ్రేక్ దర్శనాల ను పరిమితం చేసింది. అదే విధంగా బ్రేక్ దర్శన వేళల్లోనూ మార్పులు మొదలు పెట్టింది.

సిఫారసు లేఖల రద్దు
వేసవి సెలవుల్లో భారీగా పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా టీటీడీ కొత్త నిర్ణయాలు తీసుకుంది. మే 1వ తేదీ నుంచి బ్రేక్ దర్శనాల్లో మార్పులు చేస్తోంది. అదే విధంగా మే 1వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు సిఫారసు లేఖలు అనుమతించకూడదని నిర్ణయించింది. ప్రజాప్రతినిధులు, టీటీడీ బోర్డు సభ్యుల సిఫార్సు లేఖలు చెల్లవని టీటీడీ స్పష్టం చేసింది. ప్రొటోకాల్‌ వీఐపీలకు మాత్రమే బ్రేక్‌ దర్శనాలు ఉంటాయని టీటీడీ వెల్లడించింది. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్య త కల్పించేందుకు సిఫార్సు లేఖలు రద్దు చేసినట్లు టీటీడీ స్పష్టం చేసింది. అదే విధంగా బ్రేక్ దర్శనాల సమయంలో మార్పుల ను ప్రయోగాత్మాకంగా అమలుకు నిర్ణయించింది.

బ్రేక్ వేళల మార్పు
తిరుమలలో మే 1 నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాల సమయంలో టీటీడీ మార్పులు చేసింది. మే 1 నుంచి ఉదయం 6 గంటల నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రారంభం అవుతాయని వెల్లడించింది. వేసవి సెలవుల రద్దీ దృష్ట్యా ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే వీఐపీ దర్శనం కల్పిస్తామని వెల్ల డించింది. మే 1 నుంచి జులై 15వ వరకు ఈ నిర్ణయం అమలు చేయనున్నట్లు టీటీడీ అధికా రులు స్పష్టం చేసారు.


ఇది కూడా చదవండి: తిరుమలలో బ్రేక్ దర్శనాలలో కీలక మార్పులు! ఇకపై అవి రద్దు!



సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకు న్నట్లు వెల్లడించింది. ఈ వేళల మార్పు ద్వారా ఎక్కువ సమయం క్యూ లైన్లలో ఉంటున్నా సాధా రణ భక్తులకు ప్రయోజనం కలుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు అమలు చేస్తున్న కొత్త వేళల ద్వారా ఎలాంటి ఫలితం ఉంటుందో గమనించి.. కొనసాగింపు పైన నిర్ణయించనున్నారు.

కొనసాగుతున్న రద్దీ
మరోవైపు వేసవి సెలవులు, వారాంతం నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల తాకిడి భారీగా పెరిగింది. సర్వదర్శనం టోకెన్ల కోసం వచ్చిన భక్తులతో శ్రీవారిమెట్టు మార్గంలో ట్రాఫిక్‌ స్తంభించింది. చిన్నారులతో వచ్చిన తల్లిదండ్రులు అల్లాడిపోయారు. ఎస్‌ఎస్‌డీ టోకెన్ల కోసం క్యూలో ఉన్న భక్తులు ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డారు. నెలల చిన్నారులతో క్యూలైన్‌లో ఉన్న తల్లుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. మరోవైపు తిరు మలలో పోలీసుల హైఅలర్ట్ కొనసాగుతోంది. బస్టాండ్లు, హోటళ్లు, మఠాల వద్ద బాంబ్, డాగ్ ‌స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఘాట్ రోడ్లలో పలుచోట్ల వాహనాలను తనిఖీ చేస్తున్నారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

 

వివేకా కేసులో బిగ్ ట్విస్ట్.. రంగన్న భార్యకు సిట్ నోటీసులు.. ఈ వరుస మరణాల వెనుక.!

 

మరో పదవిని కైవసం చేసుకున్న కూటమి ప్రభుత్వం! 74 మంది మద్దతుతో..

 

ఏపీలోని కూటమి ప్ర‌భుత్వానికి కేంద్ర గుడ్‌న్యూస్.. ఆ నిధుల‌ విడుద‌ల!

 

వైసీపీ నేతకు దిమ్మదిరిగే షాక్! అప్పుల భారం - ఆస్తులు వేలం!

 

ఢిల్లీలో జరిగిన గంటల చర్చలు.. కీలక నిర్ణయాలు ! వాటికి ఓకే చెప్పిన మోదీ!

 

దెబ్బకు ఠా దొంగల ముఠా! లిక్కర్ కేసులో మరో నిందితుడు అరెస్ట్!

 

టీటీడీ కీలక నిర్ణయం! ఇకనుండి భక్తులకు అవి ఉచితం! ప్రవాసాంధ్రులకు కూడా భాగస్వామ్యం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #TTD #TirumalaUpdates #DarshanNews #TTDDecisions #TirumalaDarshan #TTDNews